Hanuman Movie | టాలీవుడ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం హనుమాన్ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్నాడు. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. యూనివర్సల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్ వాల్యూస్‌తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు తెగ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ ట్రైలర్ ను డిసెంబర్ 19న లాంఛ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఏషియన్ మహేష్ బాబు మాల్లో(AMB) నిర్వహించనున్నట్లు చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Get ready to experience the cinematic spectacle on the big screen💥💥#HanumanTrailer Grand Launch Event on 19th DEC @ AMB Cinemas🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HANUMAN in WW Cinemas from JAN 12, 2024💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809… pic.twitter.com/kvIfnwUofw— Vamsi Kaka (@vamsikaka) December 14, 2023