కోలీవుడ్‌లో సంచలనాత్మక హారర్ థ్రిల్లర్ ‘డిమాంటి కాలనీ’. దీని సీక్వెల్ కూడా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. త్వరలో ఈ ఫ్రాంచైజీ నుంచి ‘డిమాంటి కాలనీ 3’ కూడా రానుంది. మొదటి రెండు పార్టులకు దర్శకుడైన అజయ్ జ్ఞానముత్తు.. ఈ మూడో పార్ట్‌కి కూడా దర్శకత్వం వహిస్తారు.
ఇందులో తేజా సజ్జా కథానాయకుడిగా నటించనున్నట్టు కోలీవుడ్ సమాచారం. ఇటీవలే తేజా సజ్జాని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు కలిశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నదని తెలుస్తున్నది.