Hansika | ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీ విడాకులు హాట్ టాపిక్ గా మారిన వేళ, తాజాగా ప్రముఖ నటి హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితం గురించి మరోసారి ప్రచారాలు ఊపందుకున్నాయి. వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె ఇంట్లో నిర్వహించిన పూజల ఫోటోలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. వినాయక చవితిని హన్సిక ఘనంగా జరుపుకున్నప్పటికీ, పూజలకు భర్త సొహైల్ ఖతూరియా హాజరు కాలేదనే సంగతి చర్చనీయాంశమైంది. అంతేకాక, పూజ సందర్భంగా హన్సిక మెడలో మంగళసూత్రం లేకుండా, నుదిటిపై సింధూరం లేకుండా దర్శనమిచ్చిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం, వివాహిత మహిళలు ముఖ్యమైన పండుగల్లో మంగళసూత్రం, సింధూరంతో కనిపించడం సాధారణం. కానీ అవేమి లేకుండా కనిపించడంతో ఈ పిక్స్ భర్తతో విభేదాల్ని హైలైట్ చేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.ఇప్పటికే కొన్ని నెలలుగా హన్సిక-సొహైల్ మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. భర్తతో ఉన్న ఫోటోలు ఆమె సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడమే కాకుండా, ఇటీవల హన్సిక తల్లి వద్దకు తిరిగి వచ్చిందంటూ బీటౌన్ మీడియా కథనాలు ప్రచురించింది. అయితే గతంలో సొహైల్ ఈ వార్తలను ఖండించినప్పటికీ, తాజా పరిణామాలు మాత్రం ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చుతున్నాయి.
ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్గా వెలుగొందిన హన్సిక, గత కొంతకాలంగా వెండితెరపై కనిపించడం తగ్గించింది. పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె ఇటీవల కొన్నిచోట్ల గెస్ట్ అప్పీరెన్స్‌లు, టీవీ షోలు మాత్రమే చేసింది. వినాయక చవితి వేళ మంగళసూత్రం, సింధూరం లేకుండా హన్సిక దర్శనమిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా, అభిమానులు ఆమె నుంచి క్లారిటీ కోరుతున్నారు. ఇక ఈ వార్తలపై హన్సిక స్పందిస్తారా? లేక మౌనంగా ఉంటారా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 2022 డిసెంబర్లో హన్సిక తన బాయ్ ఫ్రెండ్ సోహైల్‌ని వివాహం చేసుకుంది. అయితే ఇది సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. అంతుకు ముందే హన్సిక స్నేహితురాలితో సొహైల్ కు వివాహమైంది.అయితే విడాకులు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు హన్సిక, సొహైల్ కూడా విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.