Actor Vijay | సినిమా తారలంటే చాలా మందికి అభిమానమే ఉంటుంది. ఇందులో సౌత్ సూపర్ స్టార్ దళపతి విజయ్ అంటే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నది. విజయ్ ఎక్కడికి వెళ్లినా ఆయనను చూసేందుకు అభిమానులు తరలివస్తుంటారు. ఇటీవల విజయ్ తన చిత్రం షూటింగ్ కోసం సోమవారం కేరళకు వెళ్లాడు. అక్కడ అభిమానులు నటుడికి ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నటుడును చూసేందుకు భారీగా తరలివచ్చారు.
తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి నుంచి హోటల్‌కు వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో అభిమానులు భారీగా తరలిరావడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఎలాగైనా విజయ్ను చూడాలనే కోరికతో వచ్చిన ఫ్యాన్స్.. చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో విజయ్‌కి ఏమీ కాలేదని, ఆరోగ్యంగానే ఉన్నారు. విజయ్ ‘గోట్’ (The Greatest of All Time ) షూటింగ్ కోసం కేరళకు వెళ్లాడు.
వారం రోజుల పాటు ఇక్కడే షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. విజయ్ చాలా సంవత్సరాల తర్వాత కేరళకు చేరుకున్నారు. చివరిసారిగా విజయ్ 2011లో ‘కావలన్’ చిత్ర షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చారు. ఈ చిత్రంలో విజయ్ డబుల్ రోల్ పోషించనున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా తీసుకోగా.. మరో పాత్ర కోసం సీనియర్ నటి త్రిషను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.
#VijayStormhitskerala #ThalapathyVijay #TVKVijay Thalapathy Vijay Car broken by rush of huge Kerala fans pic.twitter.com/Vdd9NVO9I9
— Mervin Raj (@MervinR80838445) March 18, 2024