నరేష్ ఆగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. డార్క్ కామెడీతో రూపొందిన ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకుడు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ సినిమా నుంచి ‘పైసా డుమ్ డుమ్’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ ‘మల్టీపుల్ క్యారెక్టర్స్, లేయర్స్‌తో ఉండే ఈ సినిమా ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆద్యంతం చక్కటి హాస్యంతో ఆకట్టుకుంటుంది’ అన్నారు.
మన నేటివిటీని ప్రతిబింబిస్తూ అద్భుతమైన కామెడీతో అలరించే చిత్రమిదని హీరో నరేష్ ఆగస్త్య తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని కథానాయిక ఫరియా అబ్దుల్లా తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: కృష్ణ సౌరభ్, నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ), రచన-దర్శకత్వం: మురళీ మోహన్.