నరేష్ ఆగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న డార్క్ కామెడీ ఎంటర్టైనర్ ‘గుర్రం పాపిరెడ్డి’ ఈ నెల 19న విడుదలకానుంది. మురళీ మనోహర్ దర్శకుడు. శనివారం ట్రైలర్ను విడుదల చేశారు. నలుగురు మిత్రులు కలిసి శ్రీశైలం అడవుల్లో సమాధి చేసిన శవాన్ని దొంగతనం చేయడానికి వెళ్లడం, అక్కడ వారికి మరికొందరు గ్రేవ్ రాబర్స్ పోటీకి రావడం, వారి మధ్య ఏర్పడిన గ్యాంగ్వార్తో టీజర్ ఉత్కంఠగా సాగింది. 1927 నుంచి 1987 వరకు జీవించిన కళింగ పోతురాజు ఎవరు? శ్రీ మార్కండేయ రాజుతో ఈ కథకు ఉన్న సంబంధమేమిటనే అంశాలు ట్రైలర్లో ఆసక్తినిరేకెత్తించాయి. ఈ చిత్రానికి సంగీతం: కృష్ణసౌరభ్, నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ).