ధమ్ మసాలా బిర్యానీ
మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ చిత్రం నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. అతడు, ఖలేజా వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత త్రివిక్రమ్-మహేష్‌బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ చిత్రం నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. అతడు, ఖలేజా వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత త్రివిక్రమ్-మహేష్‌బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలకానుంది. మంగళవారం దర్శకుడు త్రివిక్రమ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ధమ్ మసాలా’ గీతాన్ని విడుదల చేశారు.
రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతాన్ని సంజిత్హెగ్డే, జ్యోతి నూరన్ ఆలపించారు. తమన్ స్వరకర్త. సరికొత్త ట్యూన్, మాస్ బీట్తో ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. ‘నా తలరాతే రంగుల రంగోలి, దిగులైనా చేస్తా దీవాళి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి’..‘నేనో నిశ్శబ్దం..అనునిత్యం నాతో నాకే యుద్ధం’ వంటి చరణాలు హీరో స్వభావాన్ని ఆవిష్కరిసూ సాగాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, జయరామ్, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

