Meenakshi Chaudhary | విశ్వక్సేన్, మీనాక్షిచౌదరి, శ్రద్ధాశ్రీనాథ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న మాస్, యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ’. ముళ్లపూడి రవితేజ దర్శకుడు. రామ్ తాళ్లూరి నిర్మాత. అక్టోబర్ 31న దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. బుధవారం ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేశారు. ‘గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే.. ఇంక నాతో ఉంటడే..’ అంటూ సాగే పాటను సుద్ధాల అశోక్‌తేజ రాయగా, జేక్స్ బెజోయ్ స్వరపరిచారు. మంగ్లీ ఆలపించారు. విశ్వక్సేన్, మీనాక్షి చౌదరిలపై చిత్రీకరించిన ఈ పాటలో డాన్స్ మూమెంట్స్‌ను డాన్స్‌మాస్టర్ యష్ సంప్రదాయబద్ధంగా, ఆకర్షణీయంగా డిజైన్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ కాటసాని, నిర్మాణం: ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్.
ఇదిలావుంటే.. బుధవారం విశ్వక్సేన్ తాజా సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. ‘జాతిరత్నాలు’ఫేం అనుదీప్ కేవీ దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేశ్ సారంగం ఛాయాగ్రహకుడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.