హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్నారు. గండిపేటలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
చెట్ల గొప్పదనాన్ని తెలుపుతూ రూపొందించిన వృక్షవేదం పుస్తకం బాగుందన్నారు. తనకు మొక్కలు నాటడం అంటే ఇష్టమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా నితిన్, వెన్నెల కిశోర్, గీతా మాధురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.