విన్ను మద్దిపాటి, స్మిరిత రాణిబోర, కాలకేయ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న చిత్రం ‘గ్రంథాలయం’. సాయిశివన్ జంపాన దర్శకుడు. ఎస్.వైష్ణవి నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక గురువారం జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘నాకొచ్చిన ఓ కల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. ఆద్యంతం సస్పెన్స్‌తో థ్రిల్‌ను పంచుతుంది’ అన్నారు. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైక కథ ఇదని నాయకానాయికలు తెలిపారు.
తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్, సంగీతం: వర్ధన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: చిన్నా, నిర్మాణ సంస్థ: వైష్ణవి క్రియేషన్స్, రచన-దర్శకత్వం: సాయిశివన్.