డ్యాన్స్ ప్రేమికులను అలరించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’ డాన్స్ షోకు కొనసాగింపుగా రూపొందిన డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్‌ఫైర్’. ఈ నెల 14 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రీమియర్‌కు ఈ డాన్స్ షో రెడీ అవుతున్నది. ఓంకార్, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ ైస్టెల్స్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ ‘సీజన్1ను మించేలా సీజన్2ను తీసుకొస్తున్నాం. ఫరియా అబ్దుల్లా హోస్ట్‌గా చేస్తుండటం ఆనందంగా ఉంది. శేఖర్ మాస్టర్ సెకండ్‌టైమ్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ ‘డ్యాన్స్ ఐకాన్2 వైల్డ్‌ఫైర్’ తప్పకుండా అందర్నీ ఎంటైర్టెన్ చేస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు శేఖర్ మాస్టర్, ఫరియా అబ్దుల్లా ఆనందం వెలిబుచ్చారు. ఇంకా మెంటార్ మోహన్, సింగర్ జాను లిరి, మెంటార్ ప్రకృతి కూడా మాట్లాడారు.