గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘రామబాణం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. గోపీచంద్ నటిస్తున్న 30వ చిత్రమిది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. శ్రీవాస్ దర్శకుడు. డింపుల్ హయతి నాయికగా నటిస్తున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర టైటిల్ అనౌన్స్ చేస్తూ చిత్రబృందం ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. కుటుంబ భావోద్వేగాలతో పాటు ఓ మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయబోతున్నారు. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడ్కర్, నాజర్, ఆలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ : భూపతి రాజా, సినిమాటోగ్రఫీ : వెట్రి పళనిస్వామి, సంగీతం : మిక్కీ జే మేయర్.