Viswam | గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకుడు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. నరేష్ వాయిస్ ఓవర్‌తో ఆరంభమైన టీజర్ ఆద్యంతం కామెడీ, యాక్షన్ అంశాలతో అలరించింది.
నాయకానాయికలు గోపీచంద్, కావ్యా థాపర్ల పరిచయ ఘట్టాలు చక్కటి హాస్యాన్ని పండించాయి. దర్శకుడు శ్రీను వైట్ల తనదైన శైలి యాక్షన్, వినోదాత్మక అంశాలతో సినిమాను తీర్చిదిద్దారని టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది.
ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర ైస్టెలిష్‌గా ఉంటుందని, కావాల్సినంత కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కెవీ గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి, దర్శకత్వం: శ్రీను వైట్ల.