కథానాయకులు ప్రభాస్(Prabhas), గోపీచంద్‌ల స్నేహాబంధం గురించి అందరికి తెలిసిందే. ముఖ్యంగా గోపీచంద్‌కు(Gopichand), ఆయన కెరీర్‌కు ప్రభాస్ ఎప్పూడు తన వంతు సహకారం అందిస్తుంటాడు. ప్రస్తుతం గోపీచంద్ విశ్వం(Vishwam Movie) అనే సినిమాలో నటించాడు. కావ్యథాపర్(Kavya Thapar) హీరోయిన్గా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్స్మీడియా ఫ్యాకర్టీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్న గోపీచంద్‌కు.. ‘మళ్లీ మీరు విలన్‌గా నటించే అవకాశం వుందా?’ అని అడిగితే.. హీరోగా చాలా కంఫర్ట్‌గా వున్నానని ఇప్పట్లో అలాంటి వుద్దేశం లేదని చెప్పాడు, అయితే ‘ఒకవేళ మీ స్నేహితుడు ప్రభాస్ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర వస్తే చేస్తారా’ అన్నప్పుడు మాత్రం తప్పకుండా చేస్తాను. అలాంటి కథ కోసం మేమిద్దరం ఎదురుచూస్తున్నాం అని సమాధానమిచ్చాడు గోపీచంద్. కాగా ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్తో(Rajashaab Movie) పాటు హను రాఘవపూడి(Hanu Raghavapudi) చిత్రంలో ఫౌజీ అనే వర్కింగ్ టైటల్‌తో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం ఓ షెడ్యూల్‌ను కూడా పూర్తిచేసుకుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడిగా కనిపిస్తాడు. అయితే ఈ చిత్రంలో ఓ నెగెటివ్ రోల్‌కు గోపీచంద్‌ను అనుకున్నాడట దర్శకుడు. ఇటీవల గోపీచంద్‌కు హను రాఘవపూడి ఆ కథను కూడా నెరేషన్ ఇచ్చేశాడట. అయితే ఇంకా గోపీ నుంచి పూర్తి గ్రీన్‌సిగ్నల్ రాలేదని తెలిసింది. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నని, రవిశంకర్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు గోపీచంద్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం, నిజం సినిమాలతో పాటు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వర్షం చిత్రాల్లో కూడా ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే.
Also Read :
Vettaiyan | అప్పుడే ఓటీటీ న్యూస్.. రజినీకాంత్ వెట్టైయాన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఇదే..!
Matka | మళ్లీ తెరపైకి వైజాగ్ పూర్ణా మార్కెట్.. వరుణ్ తేజ్ గ్లింప్స్‌తో మట్కాపై హైప్
Siva Koratala | ప్రాంఛైజీలో తారక్ దేవర 3.. ఇంతకీ కొరటాల శివ ఏమన్నాడంటే..?