టాలీవుడ్ లో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శ్రీ వాస్ డైరెక్షన్ లో గోపీచంద్ ఇప్పటికే లక్ష్యం, లౌక్యం చిత్రాల్లో నటించాడు. వీటిలో లక్ష్యం చిత్రం గోపీచంద్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత ఈ డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. గోపీచంద్-శ్రీవాస్ హ్యాట్రిక్ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై మూడోసారి సందడి చేయనుంది.
గోపీచంద్ 30వ ప్రాజెక్టును శ్రీవాస్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బయటకు వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ అండ్ వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను త్వరలోనే లాంఛ్ చేసి..రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనుంది గోపీచంద్ అండ్ టీం.
సీనియర్ రైటర్ భూపతి రాజా కథనందిస్తున్నాడు. ఈ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగనుందని అనౌన్స్ మెంట్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
The Sensational Hattrick Combination is back!
— BA Raju's Team (@baraju_SuperHit) July 14, 2021
Macho 🌟 @YoursGopichand & @DirectorSriwass joined for #Gopichandh30. Produced by @vishwaprasadtg in @peoplemediafcy @vivekkuchibotla
A complete family entertainer.
Story #BhupathyRaja 📜@UrsVamsiShekar
Shoot Begins soon! pic.twitter.com/HUKtCJ7s8M
ఇవి కూడా చదవండి..
గోవా బీచ్లో కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్.. ఫోటోలు వైరల్
రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!