Gopichand34 | యాక్షన్ హీరో గోపీచంద్ తన 34వ చిత్రాన్ని ఆదివారం నాడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ‘యాత్ర’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా. యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వి.వెంకట్, ఒక గ్రిప్పింగ్ మరియు రూటెడ్ కథతో ఈ సినిమాను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు.
ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. మండుతున్న ఆకాశం, ఒక కొండపై గంభీరంగా నిలబడిన బ్లాక్ పాంథర్ విజువల్స్ చూస్తుంటే, ఇది ఒక ఇంటెన్స్ మైథికల్ యాక్షన్ డ్రామా అని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. సామ్ సి.ఎస్ (Sam CS) సంగీతాన్ని అందిస్తుండగా, శామ్‌దత్ ఐఎస్సి ఛాయాగ్రహణం బాధ్యతలు చేపట్టారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ-మౌనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ ‘భరత వర్ష’ అనే పీరియడ్ చిత్రంలో నటిస్తుండగా, ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది.