సీటీమార్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. అయ్యో రామా మళ్లీ పాత కథే..

గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ సీటీమార్. వినాయక చవితి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే చాలా రోజుల తర్వాత ఓ తెలుగు సినిమాకు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కథ రొటీన్‌గానే ఉన్నా కూడా స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు సంపత్ నంది. దానికి తోడు పక్కా మాస్ సినిమా కావడంతో ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు. తాజాగా ఈ సినిమా తొలి వారం వసూళ్లు బయటికి వచ్చాయి. తొలి మూడు రోజులు అన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా వీక్ డేస్ మొదలైన తర్వాత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. పైగా ఏపీలో కేవలం మూడు షోలతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ ఉండటంతో వాటి ప్రభావం కూడా కలెక్షన్స్‌పై బాగానే పడింది. ఓవర్సీస్లో పరిస్థితుల ప్రభావంతో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయలేదు నిర్మాతలు. అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా 8.95 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది సీటీమార్. స్పోర్ట్స్ డ్రామాకు సోషల్ ఇష్యూను ముడిపెడుతూ సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి సీటీమార్ ఏరియా వైజ్ వసూళ్లు ఓ సారి చూద్దాం..

నైజాం: 2.31 కోట్లు
సీడెడ్: 1.65 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.13 కోట్లు
ఈస్ట్: 0.88 కోట్లు
వెస్ట్: 0.51 కోట్లు
గుంటూరు: 1.02 కోట్లు (11 లక్షలు హైర్స్)
కృష్ణా: 0.53 కోట్లు
నెల్లూరు: 0.47 కోట్లు (5 లక్షలు హైర్స్)
ఏపీ + తెలంగాణ: 8.49 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక: 0.44 కోట్లు
వరల్డ్ వైడ్: 8.95 కోట్లు షేర్
సీటీమార్ సినిమాకు రూ. 13.23 కోట్ల బిజినెస్ జరిగింది. గోపీచంద్ ప్రస్తుత మార్కెట్‌కు అది తక్కువే కానీ బయట పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బిజినెస్ చేశారు. వారం రోజుల్లో ఈ చిత్రానికి రూ. 8.95 కోట్ల షేర్ వచ్చింది. ఇంకో 4.2 కోట్లకు పైగా వస్తే కానీ సినిమా సేఫ్ జోన్‌కు రాదు. సెకండ్ వీకెండ్ ఏదైనా బాగా పర్ఫార్మ్ చేస్తే తప్ప సినిమా సేఫ్ జోన్‌కు రావడం దాదాపు అసాధ్యం. మొత్తానికి మరోసారి గోపీచంద్ సినిమాకు నిరాశ తప్పలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Lobo: లోబో, ఉమా దేవిల మధ్య లవ్ ట్రాకా.. ఏం జరుగుతుంది?
అఖిల్ కోసం మళ్లీ ఆ పని చేస్తున్న పూజా హెగ్డే..
సమంత ఊసెత్తితే నో ఇంటర్వ్యూ.. నాగచైతన్య కొత్త రూల్ !
బిగ్ బాస్ వేదికగా షణ్ముఖ్‌పై తన ప్రేమను వ్యక్తపరిచిన దీప్తి
Maestro Review: మాస్ట్రో రివ్యూ.. ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్
Bigg Boss: బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టను, ఎవరికి సపోర్ట్ చేయనన్న హాట్ యాంకర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

