టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) నటిస్తున్న తాజా చిత్రం గోపీచంద్ 30 (Gopichand30). శ్రీవాసు డైరెక్షన్లో తెరకెక్కుతుంది. రేపు ఈ సినిమా క్రేజీ అప్డేట్ రానుంది. భోగి రోజున ప్రత్యేకంగా బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో (Unstoppable 2)లో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తుండటం విశేషం.
జనవరి 14న సందర్భంగా భోగీ సందర్భంగా బాహుబలి ఎపిసోడ్స్ లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్, బాలకృష్ణ సమక్షంలో టైటిల్ లోగోను ఆవిష్కరించనున్నారు. రేపు ఉదయం 11 :10 గంటలకు టైటిల్ లోగోను లాంఛ్ చేయనున్నారు. గోపీచంద్ 30ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్ కోల్‌కతా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత హ్యాట్రిక్ హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నారు శ్రీవాసు-గోపీచంద్. ఇప్పటికే అన్‌స్టాపబుల్ -2లో బాహుబలి ఎపిసోడ్ పార్ట్-1లో గోపీచంద్, ప్రభాస్ సందడి చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ సరదా చిట్ చాట్ సెషన్‌తో సాగిన ఈ ఎపిసోడ్ ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
This BHOGI🔥
Get ready for a #Gopichand30 MASSIVE TREAT in the
Bahubali Episodes😎Title Logo Launch TOMORROW @ 11:10 AM💥
In the presence of God of Masses #NBK garu & India's Darling #Prabhas garu❤️🔥
@YoursGopichand @DirectorSriwass @DimpleHayathi @peoplemediafcy pic.twitter.com/ea5wW4bMNM— BA Raju's Team (@baraju_SuperHit) January 13, 2023