వివాహానంతరం కూడా బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ జాబితాలో ఆమె నాలుగోస్థానంలో నిలిచింది. సినీ రంగం నుంచి కత్రినాకైఫ్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
ఆ తర్వాత అలియాభట్ ఐదో స్థానంలో ఉంది. ఆకట్టుకునే అందం, అభినయంతో పాటు తనదైన శైలి నృత్యాలతో యువతరంలో కత్రినాకైఫ్ తిరుగులేని ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. గత ఏడాది డిసెంబర్లో యువ హీరో విక్కీకౌశల్తో వివాహబంధంలోకి అడుగుపెట్టిన కత్రినాకైఫ్ సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా వ్యవహరిస్తున్నది. ప్రస్తుతం ఆమె ‘టైగర్-3’ ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రాల్లో నటిస్తున్నది.