సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం తెలుగు సిని సాహిత్యానికి తీరని లోటు. ఓటమిని ఎప్పుడు ఒప్పుకోవద్దన్న ఆ సాహితి కారుడు కాలం కత్తికి తల దించక తప్పలేదు. చిన్న అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన ఆయన తిరిగి వస్తారు అని అందరు భావించారు. కాని ఊహించని విధంగా నవంబర్ 30న సాయంత్రం 4.07ని.లకు కన్నుమూసారు. పాటై ప్రశ్నించిన గొంతు శాశ్వతంగా మూగబోవడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
సిరివెన్నెల లేరన్న వార్తను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. గూగుల్ కూడా సిరివెన్నెలకు నివాళి ఘటించింది. “సిరివెన్నెల” తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం” అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. Ok Google, play Sirivennela songs అంటూ ప్రస్తుత ట్రెండింగ్ సెర్చ్‌ను ట్వీట్‌కు జోడించింది.
Ok Google, play Sirivennela songs 😞💔
— Google India (@GoogleIndia) November 30, 2021
"సిరివెన్నెల" తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం 🙌