Meetha Raghunath Wedding | గతేడాది లాగే ఈ ఏడాది కూడా పెళ్లి బాజాలు కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు కృతికర్భందా, నటాషా దోషి తదితర సినీ ప్రముఖులు ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టగా తాజాగా మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కింది. గతేడాది గుడ్‌నైట్(Good Night) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ హీరోయిన్ మీతా రఘునాథ్ (Meetha Raghunath). ఆదివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన పేరెంట్స్ చూసిన అబ్బాయితో మీతా ఏడడగులు వేయగా.. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మీతా రఘునాథ్‌కు కోలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు, ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ముదల్ ముదివమ్ నీ (Mudhal Nee Mudivum Nee) అనే సినిమాతో 2022లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మీతా అనంతరం గుడ్‌నైట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తమిళనాట రూ.50 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
Meetha Raghunath Marriage Pics#MeethaRaghunath ♥️ @RaghunathMeetha pic.twitter.com/DnlcHyUgWk
— CINE Talk (@talk_cinetalk) March 18, 2024