Mythri Movie Makers | టాలీవుడ్లో నెపోటిజం (వారసత్వం) అంశంపై ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన వై. రవిశంకర్ ఈ విషయంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇటీవల జరిగిన ‘రాజా ది రాజా’ (Raja Di Raja) చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర హీరో రిత్విక్‌ను ఉద్దేశించి వేదికపై రవిశంకర్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో రాణించాలంటే బ్యాక్‌గ్రౌండ్ కంటే సొంత ప్రతిభే ముఖ్యమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలోకి ఎవరైనా గోల్డెన్ స్పూన్ లేదా డైమండ్ స్పూన్‌తో పుట్టి రావచ్చు కానీ ఇక్కడ అవేమీ పని చేయవని, మిమ్మల్ని నిలబెట్టేది కేవలం మీలో ఉన్న ప్రతిభ మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. మన వెనుక ఎవరి అండా లేదని భావించి కష్టపడి ముందుకు సాగినప్పుడే నిజమైన విజయం దక్కుతుందంటూ హీరో రిత్విక్‌ను ప్రోత్సహిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రవిశంకర్ చేసిన ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నరేష్, వైశాఖ ధీమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.