Golden Globe Awards | ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 82వ ‘గోల్డెన్ గ్లోబ్’ (Golden Globe) అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (జనవరి 5) రాత్రి అమెరికాలోని కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో అట్టహాసంగా జరిగాయి. అయితే ఈ వేడుకలలో భారతీయ చిత్రం నిరాశ పరిచింది.
పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ (All We Imagine as Light) ఈ ఏడాది ‘గోల్డెన్ గ్లోబ్’ పురస్కారాలకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో పోటీలో నిలిచిన ఈ చిత్రానికి రెండు విభాగాల్లోనూ నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ మ్యూజికల్ చిత్రం ‘ఎమిలియా పెరెజ్’ బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో అవార్డ్ అందుకుంది. ఇక రెండు కేటగిరీల్లోను ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రానికి అవార్డు రాకపోవడంతో సినీప్రియులు నిరాశకు గురయ్యారు.
మరోవైపు 62 ఏండ్ల వయసులో హాలీవుడ్ నటి డెమి మూర్ (Demi Moore) ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది సబ్‌స్టాన్స్ (The Substance). ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది డెమి మూర్.
Also Read..