టాలీవుడ్ యువ హీరో సత్యదేవ్ (Satya Dev) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు గాడ్సే (Godse). గోపీ గణేశ్ పట్టాభి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా..మంచి స్పందన వస్తోంది. కేరళ భామ ఐశ్వర్యలక్ష్మి (Aishwarya Lekshmi) కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. గాడ్సే సినిమా డిజిటల్ హక్కులు రూ.5 కోట్లకు అమ్ముడు పోయాయన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరోవైపు హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.2.20 కోట్లు పలికాయట. ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది గాడ్సే టీం.
ఈ మూవీని సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు. గాడ్సే చిత్రాన్ని జూన్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. గాడ్సే చిత్రంలో చైతన్య కృష్ణ, పృథ్విరాజ్, తనికెళ్లభరణి, నాగబాబు కొణిదెల, బ్రహ్మాజీ, నోయెల్ సీన్, ప్రియదర్శి, నాజర్, సిజ్జు మీనన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ కాశ్యప్, సాండీ అద్దంకి మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు.
Read Also : Janhvi Kapoor | క్రేజీ ప్రాజెక్టులో.. ముగ్గురు స్టార్ హీరోయిన్లు !
Read Also : Ranveer VS Wild Teaser | బియర్ గిల్స్ తో రణ్ వీర్ సింగ్ సాహసాలు..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న టీజర్
Read Also : Anil Ravipudi | గర్జిస్తున్న సింహానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..