Godavari 2 | టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన అత్యద్భుతమైన చిత్రాలలో గోదావరి చిత్రం ఒకటి. ఈ మూవీని ఎన్ని సార్లు చూసిన బోరింగ్ ఫీల్ కలుగదు. సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. చిత్రంలోని సాంగ్స్ కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. 2006లో సుమంత్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో మూవీకి సీక్వెల్ చేస్తే బాగుంటుందని అభిమానులు అనుకున్నారు. రీసెంట్ గా సుమంత్ కూడా గోదావరి 2 చేయాలని ఫ్యాన్స్ అడుగుతున్నారని అందుకే శేఖర్ కమ్ములతో తాను టచ్ లో ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు.
నటుడిగా డైరెక్టర్ని అవకాశం అడగడంలో ఎలాంటి తప్పు లేంటూ కూడా సుమంత్ చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ములని తను కలిసి తీరతానని కూడా అన్నారు.ఇ క రాజమౌళితో కలిసి పని చేయాలనే ఆసక్తి ఉందని సుమంత్ అన్నారు. అయితే గోదావరి 2 సినిమా అనేది శేఖర్ కమ్ముల చేతుల్లో ఉందని, ఆయన సినిమా చేస్తానంటే నేను రెడీ అని సుమంత్ స్పష్టం చేశారు. చాలామంది ఆడియన్స్ గోదావరి 2 గురించి నన్ను అడుగుతున్నారు. అంతా శేఖర్ కమ్ముల చేతుల్లో ఉందని సుమంత్ పేర్కొన్నారు. ఇక తనకి సపోర్టింగ్ రోల్స్ చేయడంలో ఎలాంటి మొహమాటం కూడా లేదని అంటున్నారు. తనకి సార్, సీతారామం చిత్రాలలో పాత్రలు నచ్చడం వల్లనే చేశానని సుమంత్ అంటున్నాడు.
ఇక సుమంత్ ఇటీవల అనగనగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈటీవీ విన్లో దీనిని స్ట్రీమింగ్ చేశారు. చాలా రోజుల తర్వాత సుమంత్ ఖాతాలో మంచి హిట్ పడింది. ఇక సుమంత్- శేఖర్ కమ్ముల కాంబోలో గోదావరి 2 వస్తే చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ చేయడం కుదురుతుందా లేదంటే సుమంత్ కోరిక అలానే ఉండిపోతుందా అనేది చూడాలి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోదావరి 2 గురించి ఏమైన ఆలోచిస్తాడా అన్నది చూడాలి.