సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న ఇంటెన్స్ లవ్‌స్టోరీ ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకుడు. పి.కిరణ్ నిర్మాత. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పకులు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. రీసెంట్గా 30రోజుల భారీ షెడ్యూల్‌ని మేకర్స్ పూర్తి చేశారు. దీంతో 30శాతం చిత్రీకరణ పూర్తయిందని వారు తెలిపారు.
మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో కీలకమైన సన్నివేశాలు, పాటలు, కొంత టాకీ పూర్తి చేశామని, సంక్రాంతి తర్వాత తదుపరి షెడ్యూల్ ప్రారంభిస్తామని, త్వరలోనే ఫస్ట్‌లుక్ పోస్టర్ని కూడా విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు. రాషా తడాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: చందమామ కథలు.