Super Star Krishna | సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల ఘట్టమనేని కుటుంబం స్పందించింది. తమ కుటుంబానికి కృష్ణ మృతి తీరని లోటని తెలిపింది. ఇక ప్రతి రోజూ ఆయన్ని కోల్పోయిన భారంతోనే గడుపుతాం అంటూ… సంతాప ప్రకటన విడుదల చేసింది. ‘మా కుటుంబానికి కృష్ణ మృతి తీరనిలోటు. కేవలం వెండితెరపైనే కాదు.. ప్రేమ, మానవత్వం, ఆప్యాయత పంచడంలోనూ కృష్ణ సూపర్‌స్టారే. ఆయన చేసిన ఎన్నో మంచి పనుల ద్వారా మన మధ్య జీవించే ఉంటారు. అంతేకాదు, ఎంతోమందికి కృష్ణ స్ఫూ్ర్తిప్రదాత. అన్నింటికన్నా మిన్నగా మమ్మల్ని కృష్ణ ప్రేమించేవారు. ఇక ప్రతి రోజూ ఆయన్ని కోల్పోయిన భారంతోనే గడుపుతాం’ అని బాధాతప్త హృదయంతో అన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ (80) మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణ మరణ వార్త ఆయన కుటుంబ సభ్యులు, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
🙏@urstrulyMahesh #Namrata #Gautam #Sitara #Manjula #Padma #Priyadharashini pic.twitter.com/7yg4x0AzgL
— GMB Entertainment (@GMBents) November 15, 2022