టాలీవుడ్ (Tollywood) యువ హీరో వరుణ్ తేజ్ (Varun Tej ) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గని (Ghani ). బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ, దబాంగ్ 3 ఫేం సయీ మంజ్రేకర్ ( Saiee Manjrekar) ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాజాగా గని తొలి పంచ్‌తో ప్రేక్షకులను పలుకరించాడు. వరుణ్ తేజ్ బాక్సింగ్ రింగ్ లో పంచింగ్ మూడ్‌లో కనిపిస్తూ..ఇస్తున్న తొలి పంచ్‌తో గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.
అంతేకాదు విడుదల తేదీని కూడా ప్రకటించారు. డిసెంబర్ 3న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. గని ప్రాజెక్టులో నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా కీ రోల్స్ పోషిస్తున్నారు. నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. గ్లింఫ్స్ వీడియోలో థమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించడం ఖాయమనిపిస్తోంది. రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు బాబీ, సిద్ధు ముద్ద గని చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వరుణ్ తేజ్ మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు. వెంకటేశ్, తమన్నా, మెహరీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా..అంజలి, మురళీశర్మ, రాజేంద్రప్రసాద్, సునీల్ , అలీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి