Ghaati | చాలా కాలం తర్వాత స్వీటీ అనుష్క నుంచి వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఘాటి”. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందడంతో ఆల్రెడీ సాలిడ్ బజ్ ఈ సినిమాపై ఉంది. అయితే దానిని మరింత లెవెల్లో పెంచే విధంగా ఇప్పుడు వచ్చిన రిలీజ్ గ్లింప్స్ ఉందని చెప్పాలి. రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ఈ గ్లింప్స్ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తుండడం సినిమాపై భారీ హైప్స్ పెంచిందని చెప్పాలి. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఘాటి’ కాగా, ఈ నెల సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ యాక్షన్ డ్రామా రేపు విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ల స్పీడ్ పెంచింది.
సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు, అంటే గురువారం, ప్రత్యేకంగా రూపొందించిన ‘ఘాటి రిలీజ్ గ్లింప్స్’ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయడం విశేషం. అనుష్క-ప్రభాస్ మధ్య ఉన్న బంధాన్ని చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లింప్స్‌లో అనుష్క శెట్టి పవరఫుల్ పాత్రలో అద్భుతంగా కనిపించింది. విజువల్స్ గ్రాండియర్, నేపథ్య సంగీతం అన్నికూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ‘ఘాటి’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
ఈ సినిమాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జగపతి బాబు, జిషు సేన్‌గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేదం తర్వాత అనుష్క-క్రిష్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ‘వేదం’ వంటి క్లాసిక్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సోషల్ రెలెవెంట్ కాన్సెప్ట్, కమర్షియల్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ ఫీమెల్ లీడ్ ఇవన్నీ కలిపి ‘ఘాటి’ సినిమాను హైప్డ్ ప్రాజెక్ట్‌గా మార్చాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలో ఎలా అలరిస్తుందో చూడాలి!