George Reddy Director | జార్జిరెడ్డి సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జీవన్ రెడ్డి. ఇక మొగలిరేకులు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు ఆర్కే సాగర్. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. సిద్దార్థ సినిమాతో హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ యాక్టర్ రీసెంట్గా ది 100 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఆర్కే సాగర్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. సింగరేణి కార్మికుల జీవితాల నుంచి స్పూర్తిగా తీసుకుని సినిమా చేస్తున్నాడు. సింగరేణి కార్మికుల జీవితాల్లోని పలు కోణాలను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించబోతున్న సినిమాలో లీడ్ రోల్లో నటించనున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో రాబోతుండం విశేషం.
సింగరేణి బొగ్గు గనుల నేపథ్య కథతో ఇప్పటివరకు పరిమిత స్థాయిలో సినిమాలు వచ్చాయి. సింగరేణి కార్మికుల ఇబ్బందులు, కష్టాలు, అనుబంధాలు వంటి అంశాలను టచ్ చేస్తూ భారతీయ ప్రేక్షకులను రీచ్ అయ్యేలా పూర్తిగా కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే విధంగా జార్జిరెడ్డి డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్‌తో ఈ సినిమా ఉండబోతుందట.
సింగరేణి కార్మిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆర్కే సాగర్ తన వ్యక్తిగత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా రియలిస్టిక్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. కథకు మరింత రియలిస్టిక్ చూపించేలా భారీ స్థాయిలో అండర్ గ్రౌండ్ కోల్ మైన్స్ సెట్‌ను నిర్మించబోతున్నారని సమాచారం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుంది. మరిన్ని వివరాలపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.
Dhanush | ధనుష్ అదిరిపోయే ప్లాన్.. అప్పుడే మరో సినిమా రిలీజ్..!
Rahul Ramakrishna | ట్విట్టర్ యాక్టివిజంకు గుడ్‌బై.. వైరలవుతున్న రాహుల్ రామకృష్ణ ఎక్స్ పోస్ట్