Robyn Bernard | హాలీవుడ్ నటి రాబిన్ బెర్నాడ్ (64) కన్నుమూశారు. హిట్ సిరీస్ ‘జనరల్ హాస్పిటల్’లో ఆమె టెర్రీ బ్రాక్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆమె ఈ నెల 12న కాలిఫోర్నియాలోని శాన్ జాసియంటోలో తుదిశ్వాస విడిచారు. ఓ ఓపెన్ ప్లేస్‌లో పడిపోయి కనిపించారు. ఆమె మృతి కారణాలు తెలియరాలేదు. రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఆమె మృతిని ధ్రువీకరించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
12న మంగళవారం తెల్లవారు జామున 4.08 గంటల సమయంలో చనిపోయారని.. వేలిముద్రల ద్వారా బెర్నాడ్గా గుర్తించారు. 1980లలో స్మాల్ స్క్రీన్ నుంచి కెరీర్‌ను ప్రారంభించింది. దివా, ది ఫాక్ట్స్ ఆఫ్ లైఫ్, సైమన్ అండ్ సైమన్, టూర్ ఆఫ్ డ్యూటీ తదితర అనేక టీవీ షోల్లో నటించింది. 1984లో ‘జనరల్ హాస్పిటల్’ సిరీస్ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. టెర్రీ బ్రాక్ పాత్ర ప్రేక్షకుల ఆదరణ పొందింది. జనరల్ హాస్పిటల్ సిరీస్‌లో వచ్చిన 140 కంటే ఎక్కువ ఎపిసోడ్స్‌లో ఆమె కనిపించారు. ఆమె చివరిసారిగా 1990లో సిరీస్‌లో కనిపించారు. కెరీర్లో చివరిసారిగా 2002లో వచ్చిన ‘వాయిస్ ఫ్రమ్ హైస్కూల్’లో సైకాజిస్ట్ పాత్రలో నటించారు.