అందంతో పాటు చలాకీ నటనతో నాటి యువతరం కలల రాణిగా భాసిల్లింది జెనీలియా. వివాహానంతరం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న జెనీలియా.. తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’లో కీలక పాత్రను పోషించింది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దాదాపు 14 ఏళ్ల క్రితం వచ్చిన తన పెళ్లి పుకార్లపై స్పందించింది. నటుడు జాన్ అబ్రహంతో జెనీలియా పెళ్లి జరిగిందని, సెట్లోనే వారిద్దరు పెళ్లాడారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.
అయితే ఆ తర్వాత ఏడాదే బాలీవుడ్ హీరో, తన స్నేహితుడు రితేశ్ దేశ్ముఖ్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది జెనీలియా. దాంతో ఆ పుకార్లకు చెక్ పడింది. కాగా అప్పటి వదంతులపై తాజా ఇంటర్వ్యూలో జెనీలియా మాట్లాడుతూ ‘కొంతమంది కావాలనే ఆ వార్తలను సృష్టించారు. వారెవరో కూడా నాకు తెలుసు. సెట్లో అనుకోకుండా మా పెళ్లి జరిగిందని విస్తృతంగా ప్రచారం చేశారు. అలా ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కాదు’ అని సమాధానమిచ్చింది జెనీలియా.