Olivia Wilde | సినిమాల్లో శృంగార సన్నివేశాల చిత్రీకరణపై హాలీవుడ్ నటి, దర్శకురాలు ఒలివియా వైల్డ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ‘వెరైటీ’ మ్యాగజైన్‌తో మాట్లాడిన ఆమె నేటి తరం యువత (Gen Z) వెండితెరపై అతిగా ఉండే సెక్స్ సీన్లను తిరస్కరిస్తున్నారని పేర్కొంది. అంతేగాకుండా సినిమాల్లో చాలా కాలంగా శృంగారాన్ని ఏమాత్రం సహజత్వం లేకుండా చూపిస్తున్నారని అటువంటి అవాస్తవిక సన్నివేశాలను చూసేందుకు యువత ఆసక్తి చూపడం లేదని ఆమె వెల్లడించింది. అవాస్తవికంగా ఇరికించే రొమాన్స్ కంటే వాస్తవానికి దగ్గరగా ఉంటూ, స్నేహం మరియు ఇతర బంధాలకు విలువనిచ్చే కథలనే ఈతరం యువత కోరుకుంటుందని వైల్డ్ అభిప్రాయపడింది.
అయితే ఒలివియా వ్యాఖ్యలకు బలాన్నిస్తూ ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. దాదాపు 48.4 శాతం మంది యువత ప్రస్తుతం టీవీ షోలు, సినిమాల్లో సెక్స్ కంటెంట్ మోతాదుకు మించి ఎక్కువగా ఉందని తేల్చి చెప్పారు. కేవలం ఆకర్షణ కోసం కథకు సంబంధం లేని సన్నివేశాలను జోడించే ధోరణి మారాలని, యువత ఇప్పుడు కథల్లో నిజాయితీని, సహజత్వాన్ని వెతుక్కుంటున్నారని ఈ రిపోర్ట్స్ వెల్లడించాయి.
#OliviaWilde says Gen Z wants to see less sex in movies and TV because they “don’t want to see inauthenticity anymore.”
“The way that sex has been portrayed in film for a long time hasn’t been particularly realistic,” Wilde tells Variety at #Sundance.
Nearly half of Gen Z… pic.twitter.com/WMLbGTzjUR
— Variety (@Variety) January 24, 2026