Geetha MAdhuri | తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన స్వరంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ గాయని గీతా మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు. పాటలతోనే కాదు, టీవీ షోలతో, సోషల్ మీడియాలో తన యాక్టివ్నెస్తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె… తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. గీతామాధురి ఇటీవల గాయకుడు నోయెల్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ప్రోమోలో గీతామాధురి మాట్లాడుతూ…నేను ఎప్పుడో ఒక రోజు కాఫీ షాప్‌కి వెళ్తాను. ఆ రోజే ఏదో ఒక ప్రేమ జంట అక్కడికి వస్తుంది. నేను వెళ్లినప్పుడే ఎవరో ఒకరు దొరుకుతారు. ఇలా చాలా మంది నాకు కనిపించారు” అంటూ నవ్వుతూ చెప్పారు. అయితే ఈ విషయంపై ఆమె చేసిన మరో కామెంట్ సంచలనం సృష్టించింది.నేను చూసిన వాటి గురించి నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి అంటూ గీతామాధురి చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గీతామాధురి చెప్పిన ఆ జంటలు ఎవరు? వారు టాలీవుడ్‌కు చెందినవారా? లేక ఆమె వ్యక్తిగత పరిచయాల్లో ఉన్నవారా? అనే విషయంపై నెటిజన్లు చర్చలు మొదలుపెట్టారు. అయితే ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
ఇక గీతామాధురి కెరీర్ విషయానికి వస్తే… ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు పాటలు, టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు. నందు భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబాన్ని చూసుకుంటూనే తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సాధారణంగా నవ్వుతూ, సరదాగా ఉండే గీతామాధురి… ఈసారి చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద చర్చకు దారి తీశాయి. పూర్తి ఇంటర్వ్యూ విడుదలైతే మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.