Geeta Govindam | గీతగోవిందం కాంబినేషన్ రిపీట్.. ముహూర్తానికి టైం ఫిక్స్..!
Geeta Govindam | గీతగోవిందం (Geeta Govindam) సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు పరశురాం (Parasuram), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). కాగా విజయ్-పరశురాం మరో సినిమా చేయబోతున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Geeta Govindam | టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్ తెరపైకి రాబోతున్నాయంటే ఆ క్రేజే వేరు. అలాంటి క్రేజీ కాంబోల్లో ఒకటి పరశురాం (Parasuram), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఈ ఇద్దరూ గీతగోవిందం (Geeta Govindam) సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. పరశురాం ఓ సింపుల్ కథతో మ్యాజిక్ చేసి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేసి.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. ఈ చిత్రం విజయ్ దేవరకొండను ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర చేయడమే కాకుండా కన్నడ భామ రష్మిక మందన్నాకు సూపర్ హిట్ ఇచ్చింది.
కాగా విజయ్-పరశురాం మరో సినిమా చేయబోతున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ఇద్దరితో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సినిమాకు ప్లాన్ చేసినట్టు సమాచారం. అంతేకాదు తాజా టాక్ ప్రకారం రేపు ఉదయం 9:30 గంటలకు ఈ మూవీని లాంఛ్ చేయబోతున్నారట.
ఆసక్తికర విషయమేంటంటే ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఫీ మేల్ లీడ్ రోల్లో పూజా హెగ్డే కన్ఫామ్ అయిందని వార్తలు రాగా.. ఆమె స్థానంలో మృణాళ్ ఠాకూర్‌ను రీప్లేస్ చేసినట్టు టాక్.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమాతో బిజీగా ఉన్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్‌తో చేయనున్న జేజీఎం (జనగణమన) సస్పెన్స్‌లో పడ్డది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

