Gautham Vasudev Menon | గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Menon) దర్శకత్వంలో వచ్చిన క్రైం యాక్షన్ థ్రిల్లర్ జోనర్ ప్రాజెక్ట్ రాఘవన్. కమల్ హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటించగా.. జ్యోతిక, కమలినీ ముఖర్జీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ అందించాడు గౌతమ్ మీనన్. ఓ ఇంటర్వ్యూ ఇదే విషయమై మాట్లాడుతూ.. తాను ఇటీవలే కమల్ హాసన్‌ను కలిశానని చెప్పాడు గౌతమ్ మీనన్. కమల్ హాసన్‌కు 45 నిమిషాలపాటు కథ వినిపించినట్టు చెప్పాడు.
సీక్వెల్ పార్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయినట్టేనన్నాడు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా తెరకెక్కిస్తున్న ధ్రువ నక్షత్రం : యుద్ద కాండం (Dhruva Natchathiram) విడుదలైన తర్వాత రాఘవన్ 2 ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టబోతున్నట్టు తెలియజేశాడు. ఇటీవలే రాఘవన్ సినిమా గ్రాండ్‌గా రీరిలీజ్ అవగా.. మరోసారి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హరీష్ జైరాజ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ధ్రువ నక్షత్రం ట్రైలర్ ఫ్యాన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్టు చెబుతోంది. ఈ చిత్రాన్ని ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.
గౌతమ్ వాసు దేవ్ మీనన్ మరోవైపు శ్రీసింహ టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రాజెక్ట్ ఉస్తాద్ (Ustaad ) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ధ్రువ నక్షత్రం టీజర్ ..