Mahesh Babu| అక్కినేని ఫ్యామిలీకి మనం మూవీ ఎప్పటికి అలా గుర్తుండిపోతుంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, అమల నటించారు. ఈ మూవీ అభిమానులకి కూడా మంచి వినోదం పంచింది. ఇలానే ఘట్టమనేని ఫ్యామిలీ మూవీ కూడా ఒకటి రావల్సి ఉండగా, ఏవో కారణాల వలన ఆగిపోయిందట. గౌతమ్ హీరోగా మహేష్ బాబు, కృష్ణ ముఖ్య పాత్రలలో జయంత్ సి పరాన్జీ ఒక మూవీని ప్లాన్ చేశారట. జయంత్‌కి మహేష్ బాబు చాలా క్లోజ్ కావడంతో సినిమా చేయాలని పనులు కూడా మొదలు పెట్టేశారు. కానీ ఏం జరిగిందో ఏమో ఆ మూవీ వర్కౌట్ కాలేదట.
నిజంగా ఆ మూవీ వర్కౌట్ అయితే ఘట్టమనేని ఫ్యామిలీలో గొప్ప చిత్రంగా మిగిలిపోయేది. సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా కలిసి నటించిన మూవీగా అందరికి ఎప్పటికీ గుర్తుండిపోయేది. ఘట్టమనేని ఫ్యామిలీలో ముందుగా కృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా ఆయన వారసుడిగా మహేష్ వచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు. భవిష్యత్‌లో ఆయన తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు గౌతమ్ కూడా సినిమాలలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది దర్శకులు గౌతమ్ హీరోగా కొన్ని కథలు రాసి మహేష్‌కి వినిపిస్తున్నారట. యాక్టింగ్‌లో ట్రైనింగ్ పూర్తయ్యాక గౌతమ్ హీరోగా సినిమాని తెరకెక్కించే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే బాలనటుడిగా గౌతమ్ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు హీరోగా రూపొందిన `వన్ నేనొక్కడినే` చిత్రంలో బాలనటుడిగా గౌతమ్ పరిచయం అయ్యాడు. ఇందులో చిన్నప్పటి మహేష్ గా గౌతమ్ కనిపించి అలరించారు. కానీ సినిమా ఆడలేదు. దీంతో మళ్లీ సినిమాల వైపు చూడలేదు గౌతమ్. త్వరలో గౌతమ్ హీరోగా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఎస్ఎస్ఎంబీ29` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన వీడియో సంచలనం సృష్టించింది. సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.