బిగ్‌బాస్ 7వ సీజన్ ఫేమ్ గౌతమ్‌కృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘సోలో బాయ్’. సతీశ్ నిర్మాత. పి.నవీన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమ్కృష్ణతో కలిసి శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి లీడ్ రోల్స్ చేస్తున్నారు. మేకర్స్ బుధవారం టైటిల్ అనౌన్స్మెంట్ చేసి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
నిర్మాత మాట్లాడుతూ.. ‘ఈ కథకు ఈ జనరేషన్ ఈజీగా కనెక్ట్ అవుతారు. రెండు పాటలు మినహా మిగతా సినిమా షూటింగ్ పూర్తయింది’ అని తెలిపారు. ‘తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్ట్ ఉంది. గతంలో ‘ఆకాశవీధిలో’ చేసినపుడు నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘సోలో బాయ్’గా వస్తున్న నన్ను ఆదరిస్తారనుకుంటున్నా’ అని అన్నారు హీరో గౌతమ్‌కృష్ణ. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని దర్శకుడు చెప్పారు.