నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘గరం గరం..’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియోను విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్నందించిన ఈ పాటను విశాల్ దల్జానీ ఆలపించారు. సహపతి భరద్వాజ్ పాత్రుడు రచించారు. నాని పాత్రలోని ఇంటెన్సిటీని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. కోపాన్ని క్రమపద్ధతిలో వాడుకుంటూ ప్రత్యర్థులను అంతమొందించే సూర్య పాత్రలో నాని అభినయం హైలైట్‌గా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జే.సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.