Indian 3 | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా ప్రాంఛైజీ ప్రాజెక్ట్ ఇండియన్ 3 (Indian 3). భారతీయుడుకు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ విడుదలపై సందిగ్ధం నెలకొంది. దీనిక్కారణం పాపులర్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ తీసుకున్న నిర్ణయమే. ఇండియన్ 3 షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేసే వరకు తమిళనాడులో గేమ్ ఛేంజర్‌ను విడుదల చేయొద్దని శంకర్‌కు లైకా ప్రొడక్షన్స్ అల్టిమేటమ్ జారీ చేసింది. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ తమిళ నిర్మాత మండలిని కలిసి ఫిర్యాదు చేసింది.
అయితే ఇండియన్ 3కి సంబంధించి కొన్ని పోర్షన్లతోపాటు పాట చిత్రీకరణ పెండింగ్‌లో ఉండగా.. గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత చిత్రీకరణ పూర్తి చేస్తానని శంకర్ లైకా టీంకు చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. ఈ విషయంపై శంకర్-లైకా ప్రొడక్షన్స్ మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. ఈ నేపథ్యంలో మరి తమిళనాడులో గేమ్ ఛేంజర్ అనుకున్న సమయానికే విడుదలవుతుందా..? లేదా..? అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Lyca Vs Shankar🚨
Lyca: Without completing #Indian3, Dir Shankar should not release his #GamChanger in Tamilnadu
Shankar: Still some Portions & Song shoot pending on #Indian3, so it will be done Post Gamechanger
Negotiations going on !! pic.twitter.com/ydxhTrUKLr
— AmuthaBharathi (@CinemaWithAB) January 6, 2025
Game Changer | గేమ్ ఛేంజర్‌లో ఈవెంట్లో విషాదం.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన దిల్ రాజు
Nara Brahmani | మణిరత్నం సినిమాకి బాలకృష్ణ కూతురు ఎందుకు నో చెప్పిందంటే.?