Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్‌ఛేంజర్ (Game changer) ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా ఎప్పుడు అప్డేట్ ఇస్తారా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే తాజాగా వారికి గుడ్ న్యూస్ చెబుతూ మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో రామ్ చరణ్ షూటింగ్ ఫస్ట్ డే ఫొటోతో పాటు షూటింగ్ చివరి రోజు ఫోటోను కలిపి పంచుకున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు.
ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదల అయిన అనంతరం గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పడనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
It’s been a MEGA POWER PACKED journey from the first day of shooting to the last for our #GameChanger @AlwaysRamCharan 🔥🔥
𝐈𝐭’𝐬 𝐚 𝐰𝐫𝐚𝐩 ❤️🔥
Bringing you some Blistering Updates soon 💥🤟🏻 @shankarshanmugh @advani_kiara @MusicThaman @DOP_Tirru @artkolla @SVC_official… pic.twitter.com/hn8zciY0yp
— Sri Venkateswara Creations (@SVC_official) July 8, 2024
ఇవి కూడా చదవండి..