Vemulawada | ఎములాడ రాజన్న ఆలయంలో కోడెల పంపిణీ.. 511 మంది రైతులకు రెండు చొప్పున..
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో కోడెల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. ఆరు నెలల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ ప్రారంభించారు. 511 మంది రైతులకు రెండు కోడెల చొప్పున పంపిణీ చేశారు.
వేములవాడ: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో కోడెల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. ఆరు నెలల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ ప్రారంభించారు. 511 మంది రైతులకు రెండు కోడెల చొప్పున పంపిణీ చేశారు. కోడెలను ఇతరులకు అమ్మబోమని, తామే సాకి వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటామని రైతుల నుంచి అంగీకారపత్రం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లబ్ధిదారుల ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లను అధికారులు సేకరించారు. తద్వారా ఎప్పటికప్పుడు కోడెల పరిక్షరణను పర్యవేక్షించనున్నారు.
ఎములాడ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటారు. అలా వచ్చిన కోడెలు, ఆవులను ఆలయ అధికారులు తిప్పాపూర్ గోశాలలో సంరక్షిస్తారు. వాటిని ఎప్పటికపుడు అన్నదాతలకు అందజేస్తుంటారు. అయితే గత ఆరు నెలల నుంచి పంపిణీ చేయకపోవడంతో గోశాలలో సామర్థ్యానికి మించి మూగజీవాలు వచ్చి చేరాయి.
గోశాలలో మొత్తం 500 కోడెలు ఉండడానికి సౌకర్యాలుండగా, ప్రస్తుతం 1800 వరకు ఉన్నాయి. దీంతో జీవాలకు వ్యాధులు సంక్రమిస్తాయని భావించిన అధికారులు.. కోడెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. గోశాల నుంచి కోడెలను నిజమైన లబ్ధిదారులకు అందించేందేకు కలెక్టర్ ఆధ్వర్యంలో విధివిధానాలు రూపొందించించారు. దానికి అనుగుణంగా కోడెలను పంపిణీ చేశారు. కాగా, ఎవరైనా కోడెల సంరక్షణ భారమని భావిస్తే తిరిగి గోశాలలో అప్పగించవచ్చని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

