అమరావతి : గ్లోబల్‌స్టార్ రాంచరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా విజయవంతం కావాలని కోరుతూ ఆయన అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి విజయవాడ (Vijayawada) వజ్ర గ్రౌండ్లో 256 అడుగుల ఎత్తు వరకు రాంచరణ్ కటౌట్‌ను నెలకొల్పారు.
రాంచరణ్ పేరిట గిన్నిస్‌బుక్ (Guinness Book ) వరల్డ్ రికార్డు ఉండాలనే లక్ష్యంతో ఈ భారీ కటౌట్‌ను రాంచరణ్ యువశక్తి ఆధ్వర్యంలో నెలకొల్పామని అభిమానులు తెలిపారు. సుమారు వారం, పదిరోజుల పాటు నుంచి చెన్నై వారి సహకారంతో నిర్మాణ పనులు చేపట్టామని వెల్లడించారు. కాగా వజ్ర గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం జరుగనున్న గేమ్‌ఛేంజర్ వేడుకల్లో కటౌట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాంచరణ్‌కు బహుమానంగా ఇవ్వాలని భావించి కటౌట్‌ను నిర్మించామని తెలిపారు.
సాయంత్రం జరిగే వేడుకలకు దర్శక, నిర్మాతలతో పాటు చిత్ర బృందం సభ్యులు పాల్గొంటారని వివరించారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించాడు. రామ్ చరణ్, కియారా అద్వాణి, ఎస్.జె.సూర్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025 జనవరి 10న విడుదల కానుంది.