Sai Pallavi |రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ ‘గేమ్‌ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ ‘భారతీయుడు2’ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుందని అభిమానుల్లో చర్చ నడుస్తున్నది. ‘గేమ్‌ఛేంజర్’ సమ్మర్లో విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలావుంటే.. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా ముందు మృణాళ్ పేరు వినపడింది. ఆ తర్వాత జాన్వికపూర్ పేరు లైన్లోకొచ్చింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కాదు సాయిపల్లవి అని కొత్త వార్త మీడియాలో హల్చల్ చేస్తున్నది.
రూరల్ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో కథానాయికగా సాయిపల్లవి అయితేనే కరెక్ట్‌గా ఉంటుందని బుచ్చిబాబు భావించాడట. సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. త్వరలోనే చిత్రీకరణ మొదలుకానున్న ఈ సినిమాలో విజయసేతుపతి కీలక భూమిక పోషిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బానర్లపై నిర్మించనున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు.