వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా తన ఫైళ్లతో ప్రకంపనలు సృష్టిస్తున్న లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్పై ఇప్పుడు కుట్ర సిద్ధాంతాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ప్రముఖులకు మైనర్ బాలికలను సరఫరా చేసిన ఆరోపణలతో జైలుపాలైన ఎప్స్టీన్ వాస్తవానికి న్యూయార్క్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తుండగా, 2019, ఆగస్టు 10న ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
అయితే ఆయన మరణించ లేదని, ఇంకా జీవించి ఉన్నారన్న కుట్ర సిద్ధాంతాలు వ్యాప్తి చెందుతున్నాయి. భద్రతా లోపాలు, జైలులోని రికార్డుల వైరుధ్యం వీరి వాదనకు బలం చేకూరుస్తున్నాయి.