హైదరాబాద్, ఫిబ్రవరి 6: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా..హైదరాబాద్‌లో రెండో షోరూంను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడు..రాష్ట్రంలో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరో షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు, ఇది మరో మైలురాయిగా నిలువనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో లగ్జరీ కార్ల మార్కెట్ 8-10 శాతం వరకు వృద్ధిని నమోదు చేసుకుంటున్నట్టు తెలిపారు.