పాటల చిత్రీకరణలో దర్శకుడు శంకర్‌ది ఓ ప్రత్యేకశైలి. ఆయన తొలి సినిమా ‘జెంటిల్‌మేన్’ నుంచి ప్రతి సినిమాలోని పాటలు గ్రాండియర్‌గా విజువల్ ఫీస్ట్‌గా అనిపిస్తాయి. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్ హీరోగా ‘గేమ్ చేంజర్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేశారు. గురువారం ఈ సినిమా నుంచి మూడో పాట విడుదలైంది. ‘నా నా హైరానా.. ప్రియమైనా హైరానా.. ’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, థమన్ స్వరపరిచారు. శ్రేయా ఘోషల్, కార్తీక్ ఆలపించారు. ‘వందితలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే..వజ్రంలా మెరిశా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే’ వంటి చరణాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
రామ్‌చరణ్, కైరా అద్వానీ స్క్రీన్ కెమెస్ట్రీ ఈ పాటలో అద్భుతంగా ఉంటుందని, శంకర్ తనదైన శైలిలో కలర్ఫుల్గా, గ్రాండియర్‌గా ఈ పాటను మలిచారని, న్యూజిలాండ్‌లో రెడ్ ఇన్ఫ్రా కెమెరాతో ఈ పాటను షూట్ చేయడం జరిగిందని, ఇది ఇండియాలో ఇప్పటివరకూ జరగని ప్రక్రియ అని, ఈ పాట ఓ పెయింటింగ్‌లా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, సునీల్, నవీన్‌చంద్ర తదితరులు ఇతర పాత్రధారులు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.