Dil Raju | అశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లవ్ మీ. నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో ఓ ఆసక్తికర వార్త చెప్పి అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నారు. గేమ్ ఛేంజర్ కంటెంట్ రాంచరణ్ (Ram Charan) పుట్టినరోజును బయటకు రాబోతుందని దిల్ రాజు చెప్పారు. అభిమానులు గేమ్ ఛేంజర్ అప్డేట్ గురించి అడుగుతూనే ఉన్నారు. రాంచరణ్ బర్త్ డే మార్చి 27న గేమ్ ఛేంజర్ కథ ఏంటో చెప్పబోతున్నామంటూ స్పష్టత ఇచ్చారు. మరి ఈ రోజున వచ్చేది గ్లింప్స్ వీడియోనా.. లేదంటే సాంగ్ మాత్రమేనా అనేది మాత్రం వెల్లడించలేదు.
మరి మార్చి 27న శంకర్-రాంచరణ్ మార్క్ ట్రీట్ ప్రేక్షకులకు అందబోతుందా..? అనేది చూడాలి. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ మార్చి చివరికల్లా పూర్తవుతుందని వార్తలు రాగా.. దీనిపై మేకర్స్ నుంచి కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. అంతేకాదు రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇక మరోవైపు రాంచరణ్ కొత్త ప్రాజెక్టు ఆర్సీ 16 షూటింగ్ మార్చి చివరలో షురూ కానుందని నెట్టింట అప్డేట్స్ చక్కర్లు కొడుతుండగా.. రానున్న రోజుల్లో బుచ్చిబాబు అండ్ టీం ఈ మూవీపై ఏదైనా హింట్ ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు.

Game Changer

Game Changer
Kashmir to kanyakumari BO badalu avtundi 🥵
This is Ram Charan Era 🔥🔥@AlwaysRamCharan #GameChanger pic.twitter.com/Eg6Nh4ufLw
— Royal Charan (@GameChangerRC7) November 23, 2023
South sensation @alwaysramcharan was seen arriving at the Mysore airport in a private jet. He will resume shooting for director Shankar’s ‘Game Changer’ which is going to be a political action thriller. #RamCharan #KiaraAdvani #movie #Mysore #airportlook pic.twitter.com/u3UuJRLvvb
— IndiaToday (@IndiaToday) November 23, 2023