Game Changer | రామ్‌చరణ్ కెరీర్లో గొప్ప పాత్రలంటే మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలు చెప్పుకుంటాం. త్వరలో ఆ వరుసలో ‘గేమ్‌ఛేంజర్’ కూడా చేరబోతున్నదని తెలుస్తోంది. మగధీర తర్వాత మళ్లీ ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన చేస్తున్న రెండు పాత్రలు ఒకదానికొకటి పొంతన లేకుండా సాగుతాయని తెలిసింది. అటు రామ్‌చరణ్, ఇటు దిల్‌రాజు ఇద్దరి కెరీర్లలోనూ హై బడ్జెట్ సినిమాగా ‘గేమ్‌ఛేంజర్’ రూపొందుతున్నది. ఇందులోని కథాకథనాలు ప్రేక్షకుల ఊహలకు అందని స్థాయిలో ఉంటాయని వినికిడి.
దక్షిణాది అగ్ర దర్శకుడైన శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 50శాతం పూర్తికావచ్చిందనేది విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సినిమాతోపాటు కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాకు కూడా శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు విడుదల అవుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రెండింటిపై భారీ అంచనాలుండటం విశేషం.