Gadar-2 | ‘గదర్-2’ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. సన్నీడియోల్, అమీషాపటేల్ జంటగా నటించిన ఈ సినిమా అత్యంత వేగంగా ఐదొందల కోట్ల వసూళ్లను సాధించిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం 24రోజుల్లోనే ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. షారుఖ్‌ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం 500కోట్ల మైలురాయిని అందుకోవడానికి 28 రోజుల సమయం తీసుకుంది.
‘గదర్-2’ హిందీ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఉత్తరాదిన బీ, సీ సెంటర్లలో తిరుగులేని ఆదరణతో దూసుకుపోతున్నది.